జయమంగళం నిత్య శుభమంగళం
ఈ పాట పంపించిన రాయలసీమ మిత్రుడు అడుసుమిల్లి శ్రీనివాస రావుకి ధన్యవాదాలతో
*******************************************************
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
ఆ సంకనొకబిడ్డ ఈ సంకనొకబిడ్డ
కడుపులో ఒకబిడ్డ కదలాడగా
ఆరు చాటల బియమొండి
మూడుచాటల పప్పొండి
సాలకా మా వదినె సట్టినాకే
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
అప్పుకొక పళ్ళెంబు పప్పుకొక పళ్ళెంబు
కూరనారకొక్క గుండుపళ్ళెంబు
అప్పులోడు వచ్చి చెప్పుతో కొడతాంటె
అప్పుడే మా బావ పప్పుకేడ్చెనే
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
నూగులు నుసి బట్టె గానుగలు గసిబట్టె
పెండ్లికొడుకు నెత్తికి పేండ్లుబట్టె
పెండ్లికొడుకు సిన్నాయన పేండ్లుబట్టాబోయి
గంజిగుంతలోబడి గుంజులాడ
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
పల్లెపల్లేదిరిగి పట్నాలన్నీ దిరిగి
ముల్లోకములు దిరిగి నిన్నుదెచ్చే
మూతి మూడొంకర్లు నడ్డి నాల్గొంకర్లు
ముచ్చటైన పెండ్లికూతుర నీకు హారతీ
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
ఆ వీధినొక కుక్క ఈ వీధినొక కుక్క
నట్టనడి వీధిలో నల్లకుక్క
మూడు కుక్కలు కలిసి ముచ్చటాలాడంగ
మూలనున్న పెండ్లికొడుకు మూతినాకే
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
మంగళం మంగళం మా బావ నెత్తికీ
చూరులో ఉండేటి చుంచెలుకకీ
మంగళం మంగళం మా వదినె కొప్పుకూ
గుంతలో ఉండేటి గోండ్రుకప్పకూ
జయ మంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
*******************************************************